News November 11, 2024
ప్లీజ్.. నన్నలా పిలవద్దు: కమల్ హాసన్
తనను ‘ఉలగనాయగన్’ వంటి స్టార్ టైటిల్స్‌తో పిలవొద్దని సినీపరిశ్రమ, మీడియా, అభిమానులకు కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. ఆర్ట్ కంటే ఆర్టిస్ట్ గొప్ప కాదనే విషయాన్ని తాను నమ్ముతానని, తానెప్పుడూ గ్రౌండెడ్‌గా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ మరింత మెరుగవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కమల్ హాసన్/కమల్/KH అని మాత్రమే పిలవాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 11, 2024
జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు
సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
News December 11, 2024
విశ్వక్, అనుదీప్ కొత్త మూవీ ‘ఫంకీ’
విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్‌లో ‘ఫంకీ’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. నాగవంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తారు. కాగా విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.
News December 11, 2024
మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: బీజేపీ ఎంపీ
TG: మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు పొందిన వ్యక్తి నిన్న వ్యవహరించిన తీరు దారుణమని మండిపడ్డారు. మరోవైపు జర్నలిస్టుపై మోహన్ బాబు దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తప్పుబట్టారు. జర్నలిస్టు సమాజానికి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.