News November 11, 2024
22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP: ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బిల్లులకు, చర్చలకు అనుగుణంగా శనివారం కూడా సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు 2పూటలా సభ జరగనుంది. మరోవైపు, ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ జరిపేందుకు MLAలు విధిగా అసెంబ్లీకి రావాలన్నారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేస్తామని సీఎం వెల్లడించారు.
Similar News
News November 4, 2025
లాజిస్టిక్ కారిడార్‌తో అభివృద్ధి: చంద్రబాబు

APలో అంతర్గత జల రవాణాకు పుష్కలంగా అవకాశాలున్నాయని CM చంద్రబాబు పేర్కొన్నారు. లండన్‌లో పారిశ్రామికవేత్తలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లాజిస్టిక్ కారిడార్‌తో APని అభివృద్ధి చేసే ప్రణాళికలు రచిస్తున్నట్లు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలతో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. జల రవాణాపై పని చేసేందుకు ముందుకు రావాలని లండన్‌లోని అరుప్ సంస్థను CM కోరారు.
News November 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 04, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


