News November 11, 2024

22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బిల్లులకు, చర్చలకు అనుగుణంగా శనివారం కూడా సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు 2పూటలా సభ జరగనుంది. మరోవైపు, ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ జరిపేందుకు MLAలు విధిగా అసెంబ్లీకి రావాలన్నారు. చీఫ్ విప్, విప్‌లను రేపు ఖరారు చేస్తామని సీఎం వెల్లడించారు.

Similar News

News December 8, 2024

కోహ్లీ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో సమస్య ఉంది: మంజ్రేకర్

image

విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్టులో 2 ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆయన ఆడుతున్న విధానంలో లోపం ఉందని కామెంటేటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్‌స్టంప్ ఆవల స్వింగ్ అయ్యే బాల్‌ను ఆడేందుకు కోహ్లీ కొత్త టెక్నిక్ ఎంచుకున్నారని, అది సత్ఫలితాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్‌కు మద్దతుగా నిలిచారు. ఇదే టెక్నిక్‌తో కోహ్లీ 9వేల పరుగులు చేశారని గుర్తుచేశారు.

News December 8, 2024

ఇంటింటి కులగణన సర్వే పూర్తి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 6న చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయింది. GHMC మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో భద్రపరుస్తున్నారు. మరో 4, 5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా కులగణన సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

News December 8, 2024

BREAKING: రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

image

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.