News November 11, 2024

నాలుగు రోజుల్లో 70% పెరిగిన షేరు ధర

image

JSW Holdings షేరు ధర 4 రోజుల్లో 70% పెరిగి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది Jan-Aug వరకు ₹5K-₹8K మధ్య కరెక్షన్ అవుతూ కన్సాలిడేటైన షేరు తాజాగా ₹16,978కి చేరుకుంది. దీంతో అధిక Volatilityకి అవకాశం ఉండడంతో BSE, NSE ఈ స్టాక్‌పై నిఘా పెట్టాయి. ట్రేడింగ్ యాక్టివిటీపై ఎక్స్‌ఛేంజ్‌లు వివరణ కోరాయి. మార్కెట్ ఆధారిత ట్రేడింగ్ వాల్యూమ్ కాబట్టి సంస్థ స్పందించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 21, 2026

పరీక్షల వేళ ఇలా ప్రిపేర్ అవ్వండి!

image

పరీక్షల సమయం వచ్చేసింది. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదవడం ముఖ్యం. కొత్త విషయాల కంటే చదివిన వాటిని పదేపదే రివిజన్ చేయడం వల్ల గుర్తుంచుకోవడం సులభమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం గత ఏడాది ప్రశ్నపత్రాలను చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా రిపీటయ్యే ప్రశ్నలపై దృష్టి సారించండి. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమై ఉత్తమ ఫలితాలను సాధించండి. ALL THE BEST

News February 21, 2026

ఇంట్లోనే సహజ రంగులు ఇలా చేద్దాం..

image

* పసుపు, శనగపిండి కలిపితే సులభంగా సహజ పసుపు రంగు సిద్ధమవుతుంది. * గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేయవచ్చు. వెంటనే కడిగేసుకుంటే పెద్దగా మచ్చలు పడవు. * అపరాజిత/ శంఖు పుష్పాలతో బ్లూ కలర్ తయారు చేయవచ్చు. పూలను ఎండబెట్టి పొడిగా చేసి, అందులో కొద్దిగా బియ్యప్పిండి కలపాలి. అలాగే ఈ పూలను నీటిలో నానబెడితే వచ్చిన నీటినీ రంగుగా వాడుకోవచ్చు. * ఎండిన నారింజతొక్కలను ఉపయోగించి ఆరెంజ్ రంగు చేయవచ్చు.

News February 21, 2026

హోలీ కోసం ఇంట్లోనే సహజ రంగులు

image

* పింక్ కలర్ కోసం బీట్‌రూట్‌లను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ద్రావణాన్ని వడకట్టి వాడొచ్చు. * ఎరుపు రంగు కోసం గులాబీ రేకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. తర్వాత ఎండలో పెట్టండి. ఎండబెట్టిన ఎరుపు మందార పువ్వులను పొడిగా చేసి, అందులో కొద్దిగా బియ్యప్పిండి కలిపితే ఎరుపు రంగు వస్తుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్‌గా వాడొచ్చు.