News November 11, 2024

నాలుగు రోజుల్లో 70% పెరిగిన షేరు ధర

image

JSW Holdings షేరు ధర 4 రోజుల్లో 70% పెరిగి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది Jan-Aug వరకు ₹5K-₹8K మధ్య కరెక్షన్ అవుతూ కన్సాలిడేటైన షేరు తాజాగా ₹16,978కి చేరుకుంది. దీంతో అధిక Volatilityకి అవకాశం ఉండడంతో BSE, NSE ఈ స్టాక్‌పై నిఘా పెట్టాయి. ట్రేడింగ్ యాక్టివిటీపై ఎక్స్‌ఛేంజ్‌లు వివరణ కోరాయి. మార్కెట్ ఆధారిత ట్రేడింగ్ వాల్యూమ్ కాబట్టి సంస్థ స్పందించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News December 4, 2024

మెగా హీరోకు అల్లు అర్జున్ థాంక్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే

image

మరి కొన్ని గంటల్లో ‘పుష్ప-2’ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో సహా చిత్ర బృందానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ <<14786860>>విష్<<>> చేశారు. దీనికి అల్లు అర్జున్ బదులిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మీరంతా సినిమాను ఇష్టపడతారని ఆకాంక్షిస్తున్నట్లు రాసుకొచ్చారు. అయితే అక్కడ ‘మీరంతా’ అని ఎవరిని ఉద్దేశించి అన్నారని ఐకాన్ స్టార్‌ను మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

News December 4, 2024

PHOTO: ఒక్కటైన నాగచైతన్య-శోభిత

image

అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ వివాహం ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకల్లో వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ జంట రేపు లేదా ఎల్లుండి శ్రీశైలం/తిరుమలకు వెళ్లనున్నారు.

News December 4, 2024

‘పుష్ప-2’: స్టార్లు ఏ థియేటర్లో చూస్తున్నారంటే?

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీపై అభిమానులతో పాటు సెలబ్రిటీల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇవాళ రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా పలువురు సెలబ్రిటీలు థియేటర్లలో వీక్షించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
* సంధ్య(RTC X ROAD)- కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్
* నల్లగండ్ల అపర్ణ- దర్శకుడు రాజమౌళి
* AMB- పుష్ప-2 నిర్మాతలు
* శ్రీరాములు(మూసాపేట)-దిల్ రాజు, అనిల్ రావిపూడి, ఇతర ప్రముఖులు