News November 11, 2024

TGPSC ఛైర్మన్ నియామకానికి నోటిఫికేషన్

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20న సా.5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316, TGPSC నియమావళి-2014 ప్రకారం అభ్యర్థులు అర్హతలు కలిగి ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 3తో ముగియనుంది.

Similar News

News February 15, 2026

ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం

image

ఆకాశంలో ఈ నెల 17వ తేదీ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. 3.26pm-7.57pm వరకు గ్రహణం ఉంటుంది. అయితే భారతదేశం నుంచి దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటార్కిటికా ఖండం నుంచి స్పష్టంగా కన్పిస్తుంది. సాధారణంగా సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ టైమ్‌లో చంద్రుడు సైజు చిన్నగా కనిపించడంతో సూర్యుడి అంచులు రింగ్‌లా దర్శనమిస్తాయి.

News February 15, 2026

పవర్ ప్లేలో భారత్ స్కోర్ 52-1

image

T20WC: తొలి ఓవర్లోనే అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్(42*) ధనాధన్ ఆటతో భారత్ పవర్ ప్లే ముగిసే వరకు 52 పరుగులు చేసింది. అటు తిలక్ వర్మ(10*) ఆచితూచి ఆడుతున్నారు. తొలి 6 ఓవర్లలో 5 ఓవర్లను పాక్ స్పిన్నర్లతోనే వేయించడం విశేషం.

News February 15, 2026

మహా శివరాత్రి జాగరణ చేస్తున్నారా?

image

ఇవాళ మహాశివరాత్రి జాగరణ మనలోని శివత్వాన్ని మేల్కొలుపుతుందని పండితులు చెబుతున్నారు. ఇవాళ రాత్రంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందంటున్నారు. అయితే సినిమాలు చూస్తూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, డాన్సులు చేసేది జాగరణ కాదని స్పష్టం చేస్తున్నారు. కునికిపాట్లు పడకుండా శివ నామాలను భక్తితో స్మరించాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి 12.03 గంటల నుంచి 12.53 వరకు లింగోద్భవ కాలంలో పూజలు, అభిషేకం చేయాలంటున్నారు.