News November 11, 2024

TGPSC ఛైర్మన్ నియామకానికి నోటిఫికేషన్

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20న సా.5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316, TGPSC నియమావళి-2014 ప్రకారం అభ్యర్థులు అర్హతలు కలిగి ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 3తో ముగియనుంది.

Similar News

News December 9, 2024

మెక్సికో, కెనడాలు అమెరికాలో విలీనమవడం బెటర్: ట్రంప్

image

పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలకు అందిస్తున్న రాయితీలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ‘కెనడాకు ఏటా $100B, మెక్సికోకు $300B సబ్సిడీ ఇస్తున్నాం. అసలు ఈ దేశాలకు ఎందుకు ఇవ్వాలి? దాని కంటే ఆ రెండు అమెరికాలో రాష్ట్రాలుగా విలీనమైతే మంచిది’ అని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే ఆ దేశాల దిగుమతులపై భారీ పన్నులు విధిస్తామని ఇటీవల ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.

News December 9, 2024

తులం బంగారం హమీపై మంత్రి ఏమన్నారంటే?

image

TG: కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రేషన్‌ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం లాంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. పెండింగ్‌ హామీల అమలుకు కసరత్తు జరుగుతోందని మంత్రి వివరించారు. పదేళ్లలో BRS చేయని ఎన్నోపనులను కాంగ్రెస్‌ ఏడాదిలోనే చేసిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

News December 9, 2024

WTCలో అత్యధిక విజయాలు ఈ జట్టువే

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఆ జట్టు 64 మ్యాచుల్లో 32 గెలిచింది. రెండో స్థానంలో భారత జట్టు (53 మ్యాచుల్లో 31 విజయాలు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (48 మ్యాచుల్లో 29 విన్స్) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (18), సౌతాఫ్రికా (18), శ్రీలంక (12), పాకిస్థాన్ (12), వెస్టిండీస్ (9) ఉన్నాయి.