News November 12, 2024

ఇజ్రాయెల్ దాడులు జాతి విధ్వంసమే: సౌదీ

image

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖండించారు. అవి పాలస్తీనీయుల నిర్మూలనకు జరుగుతున్న దాడులని, అంతర్జాతీయ సమాజం వాటిని అడ్డుకోవాలని కోరారు. ముస్లిం, అరబ్ నేతల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ గౌరవించాలని సూచించారు. పాలస్తీనా దేశం ఏర్పాటైతేనే తాము ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తామని యువరాజు తేల్చిచెప్పారు.

Similar News

News July 4, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.

News July 4, 2025

మథుర ‘షాహీ దర్గా’ పిటిషన్ కొట్టివేత!

image

శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం మరో మలుపు తిరిగింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలోని షాహీ దర్గాని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ముస్లిం సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది. కృష్ణ జన్మభూమిపై హిందూ సంఘాలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.

News July 4, 2025

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: దాసోజు శ్రవణ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ Way2Newsకు తెలిపారు. KCRకు తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సాధారణ నీరసానికే చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై పోరాటానికి సిద్ధమవుతున్నారని దాసోజు పేర్కొన్నారు. కాగా సోడియం లెవెల్స్ పడిపోవడంతో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు.