News November 12, 2024
RGVపై మరో ఫిర్యాదు

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. గేదెల ముఖాలకు వీరి ఫొటోలను పెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై <<14581839>>కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే.
Similar News
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


