News November 12, 2024

RGVపై మరో ఫిర్యాదు

image

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. గేదెల ముఖాలకు వీరి ఫొటోలను పెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై <<14581839>>కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే.

Similar News

News December 6, 2024

విశాఖ పోర్టులో డ్రగ్స్‌ కేసుపై వీడిన చిక్కుముడి

image

AP: ఈ ఏడాది మార్చిలో ఎన్నికల సమయంలో విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ముగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్‌ లేదని కేవలం డ్రై ఈస్ట్ ఉన్నట్లు కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో సీజ్ చేసిన షిప్‌ను విడుదల చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

News December 6, 2024

డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప్ర‌మాద‌క‌రం: కేజ్రీవాల్‌

image

బీజేపీ డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓట‌ర్ల‌ను హెచ్చ‌రించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఆప్ ప‌థ‌కాల‌ను నిలిపివేస్తార‌ని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాలో ఉచిత విద్యుత్ ఎక్క‌డ ఇస్తున్నార‌ని, మంచి స్కూల్స్‌, ఆస్ప‌త్రులు ఎక్క‌డున్నాయ‌ని ప్రశ్నించారు. గెల‌వ‌లేమ‌ని తెలిసే ఢిల్లీలో ఆప్ ఓటర్ల తొల‌గింపున‌కు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

News December 6, 2024

PHOTO: గన్నుతో సీఎం రేవంత్

image

TG: ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హోంశాఖ విజయాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆయుధాల ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. గన్నులు, రైఫిల్స్‌ పనితీరును ఆసక్తిగా పరిశీలించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.