News November 12, 2024

నకిలీ మందులు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి

image

TG: నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారితో పాటు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని DCA అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు. మెడిసిన్ ధరలు, నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News July 9, 2025

మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

image

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 9, 2025

నిమిషకు మరణశిక్ష.. తప్పెవరిది?

image

యెమెన్‌లో <<17008510>>నిమిష <<>>మరణశిక్ష ఎదుర్కోబోతుండటం చర్చనీయాంశంగా మారింది. పాస్‌పోర్ట్ లాక్కుని వేధిస్తున్నాడని మెహదీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని అతడికి ఆమె మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఆత్మరక్షణ కోసమే ఇలా చేసిందని, వదిలేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల తప్పు కూడా ఉందంటున్నారు. PM మోదీ జోక్యం చేసుకుని విడిపించాలని కోరుతున్నారు.

News July 9, 2025

సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష.. గడువు పెంపు

image

TG: సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వరకు పొడిగించినట్లు CMD బలరామ్ నాయక్ తెలిపారు. UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారు దీన్ని గమనించాలన్నారు. తొలుత ఈ నెల 7వరకు గడువు విధించగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ పథకం కింద TG అభ్యర్థులతో పాటు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రూ.లక్ష సాయం చేయనున్నారు.