News November 13, 2024
‘ప్రభాస్‌లా జుట్టు పెంచుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి’

TG: ఆహారం బాలేదనో, వార్డెన్ల గురించో రెసిడెన్షియల్ విద్యార్థులు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ, వరంగల్ జిల్లాలో తమకు ప్రభాస్ లాగా హెయిర్ స్టైల్ కావాలని అబ్బాయిలు, చీర కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అమ్మాయిలు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు వేశారు. భావాలను వ్యక్తపరచడం సరైందే అని, కానీ ఈ విద్యార్థుల అభ్యర్థనలు ఆసక్తికరంగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అని నిపుణులు అంటున్నారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కలెక్టర్

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. కడప జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
News January 14, 2026
పండుగల్లో ఇలా రెడీ..

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్‌కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.
News January 14, 2026
సిప్‌లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


