News November 13, 2024

‘ప్రభాస్‌లా జుట్టు పెంచుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి’

image

TG: ఆహారం బాలేదనో, వార్డెన్ల గురించో రెసిడెన్షియల్ విద్యార్థులు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ, వరంగల్ జిల్లాలో తమకు ప్రభాస్ లాగా హెయిర్ స్టైల్ కావాలని అబ్బాయిలు, చీర కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అమ్మాయిలు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు వేశారు. భావాలను వ్యక్తపరచడం సరైందే అని, కానీ ఈ విద్యార్థుల అభ్యర్థనలు ఆసక్తికరంగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అని నిపుణులు అంటున్నారు.

Similar News

News March 11, 2026

HEADLINES

image

* గల్ఫ్ యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత!
* కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేతతో మూతపడుతున్న హోటళ్లు
* LPG ఉత్పత్తి 10% పెంచాం: కేంద్రం
* ఈ నెల 13న PM కిసాన్ నిధుల విడుదల
* అంతర్జాతీయ స్థాయి క్రీడలకు అమరావతి సిద్ధం: CBN
* 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు: TG ప్రభుత్వం
* పెరిగిన బంగారం, వెండి ధరలు
* దాడులు తీవ్రం చేస్తామన్న US.. వెనక్కి తగ్గేదే లేదన్న ఇరాన్

News March 11, 2026

ఆపరేషన్ హార్ముజ్.. రంగంలోకి ఇండియన్ నేవీ?

image

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలను సేఫ్‌గా తీసుకురావడానికి నేవీని పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తమ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జలసంధిని దాటలేక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో 1,100 మందికిపైగా సెయిలర్స్ ఉన్న 38 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకున్నాయి.

News March 11, 2026

వచ్చే నెలలో Xలో పేమెంట్ ఆప్షన్?

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ Xలో త్వరలో ఫోన్ పే, గూగుల్ పే తరహాలో పేమెంట్ ఆప్షన్స్ రానున్నాయి. వచ్చే నెలలో పరిమిత యూజర్లకు దీని ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై X ఇప్పటికే వీసా సంస్థతో టైయప్ అయింది. కాగా Xను SM కంటే ఫైనాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న ప్లాట్‌ఫామ్‌గా మారుస్తానని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ట్రయల్స్ ఓకే అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.