News November 13, 2024

నామినేషన్ దాఖలు చేసిన RRR

image

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉప సభాపతి పదవికి RRR ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News November 8, 2025

వీధి కుక్కల విషయంలో SC మార్గదర్శకాలివే..

image

వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్రాలకు SC మార్గదర్శకాలు జారీ చేసింది. ‘విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వాటిని షెల్టర్లకు తరలించాలి. జంతువులు రాకుండా ఫెన్స్ నిర్మించాలి. వాటికి సంతానోత్పత్తి నియంత్రణ చికిత్స చేశాక అదేచోట వదలొద్దు. అలాగే NH, ఎక్స్‌ప్రెస్ హైవేలపై యజమానిలేని పశువులను గోశాలలకు తరలించాలి. ప్రభుత్వాలు, NH శాఖ ఈ ఆదేశాలను అమలు చేయాలి’ అని తెలిపింది.

News November 8, 2025

అశ్వని కురిస్తే అంతా నష్టం

image

అశ్వని కార్తె వేసవి ప్రారంభంలో(ఏప్రిల్-13/14) నుంచి వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడితే, దాని ప్రభావం తర్వాత ముఖ్యమైన వర్షాధార కార్తెలైన భరణి, కృత్తిక, రోహిణిపై పడుతుందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవవని నమ్ముతారు. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటకం కలిగి పంట దిగుబడి తగ్గుతుందని, అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని ఈ సామెత వివరిస్తుంది.

News November 8, 2025

సంకటహర గణపతి ఎలా ఉంటాడంటే..?

image

ముద్గల పురాణం ప్రకారం.. విఘ్నేశ్వరుడికి మొత్తం 32 దివ్య స్వరూపాలున్నాయి. అందులో చివరిది, విశిష్టమైనది సంకటహర గణపతి. ఈ స్వామి రూపం ప్రశాంతంగా ఉంటుంది. కుడి చేయి వరద హస్త భంగిమలో, ఎడమ చేతిలో పాయస పాత్రతో, దేవేరిని ప్రేమగా ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని కన్పిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టమట. ఈ రోజున భక్తితో ఆయన వ్రతం చేస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.