News November 13, 2024
నామినేషన్ దాఖలు చేసిన RRR

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ పదవికి ఇంకెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఉప సభాపతి పదవికి RRR ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News July 11, 2025
రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.
News July 11, 2025
మూవీ ముచ్చట్లు

* ‘ది రాజాసాబ్’ మ్యూజిక్ సిట్టింగ్స్.. తమన్‌తో ప్రభాస్
* ఓటీటీలోకి వచ్చేసిన ‘8 వసంతాలు’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
* సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కలియుగం 2064
* సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానున్న విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’
* ఇవాళ థియేటర్లలోకి ‘ఓ భామ అయ్యో రామ’, ‘సూపర్ మ్యాన్’ సినిమాలు
* కార్తీ కొత్త మూవీ ‘మార్షల్’
* సోనీలివ్‌లో యాక్షన్ డ్రామా మూవీ ‘నరివెట్ట’ స్ట్రీమింగ్
News July 11, 2025
బైకులకు చలాన్లు వేయకండి: వీహెచ్

TG: ట్రాఫిక్ పోలీసులు టూ వీలర్స్ టార్గెట్‌గా చలాన్లు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ప్రభుత్వం చొరవ తీసుకొని చలాన్లు వేయకుండా పోలీసులకు సూచనలు చేయాలని కోరారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో యువత కీలకమని, వారిని చలాన్ల పేరుతో ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలన్నారు.