News November 14, 2024

వర్తు వర్మా.. వర్తు!

image

టీమ్ఇండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సౌతాఫ్రికాతో మూడో టీ20లో అదరగొట్టారు. కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించారు. దీంతో క్రికెట్ అభిమానులు తిలక్‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘వర్తు వర్మా.. వర్తు’ అంటూ ఆయన ప్రదర్శనను కొనియాడుతున్నారు. వర్మ సెంచరీతో టీమ్ఇండియా 219 రన్స్ చేయగలిగింది. ఈ కుర్రాడి బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Similar News

News January 17, 2026

మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన రేవంత్

image

TG: పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల సమరశంఖం పూరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

News January 17, 2026

రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

image

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.

News January 17, 2026

ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

image

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It