News November 14, 2024
వర్తు వర్మా.. వర్తు!
టీమ్ఇండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సౌతాఫ్రికాతో మూడో టీ20లో అదరగొట్టారు. కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించారు. దీంతో క్రికెట్ అభిమానులు తిలక్‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘వర్తు వర్మా.. వర్తు’ అంటూ ఆయన ప్రదర్శనను కొనియాడుతున్నారు. వర్మ సెంచరీతో టీమ్ఇండియా 219 రన్స్ చేయగలిగింది. ఈ కుర్రాడి బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Similar News
News December 13, 2024
పెదవుల పగుళ్లను నివారించండిలా!
చలికాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య పెదవుల పగుళ్లు. రాత్రి పడుకునే ముందు పాలతో పెదవులను మర్దన చేసుకొని మార్నింగ్ లేవగానే కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె, ఆ నూనెతో తయారు చేసిన లిప్ బామ్స్ కూడా పగుళ్లను నివారిస్తాయి. తేనె కూడా పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పూట రాసి ఉదయాన్నే కడిగితే పెదవులు మృదువుగా మారిపోతాయి. వీటితో పాటు తగినంత నీటిని తాగడం ముఖ్యం.
News December 13, 2024
పాకిస్థాన్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ రాజీనామా
పాక్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ గిలెస్పీ రాజీనామా చేశారని క్రిక్‌బజ్ తెలిపింది. కొద్దిగంటల్లో పాక్ జట్టు సౌతాఫ్రికాకు టెస్ట్ సిరీస్ కోసం వెళ్లాల్సి ఉండగా ఆయన పాక్ క్రికెట్ బోర్డ్(PCB)కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది. ‘గిలెస్పీ రాజీనామా చేశారు’ అని PCB అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని వివరించింది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్‌నే టెస్టు జట్టుకూ తాత్కాలికంగా PCB నియమించింది.
News December 13, 2024
అల్లు అర్జున్‌కు ఏమైంది?
ఇటీవల పలు ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ వ్యవహారంపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. మొన్న ఈవెంట్‌లో <<14819498>>తెలంగాణ CM పేరును<<>> ఆయన మరిచిపోయారని చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఈవెంట్‌లోనూ సుకుమార్ పేరును <<14859353>>సుకుమార్ రెడ్డి<<>> అని సంబోధించారు. అయితే మరోసారి ఐకాన్ స్టార్ పొరబడ్డారని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీంతో అల్లు అర్జున్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు.