News November 14, 2024
IND, PAK హక్కుల్ని ICC రద్దు చేయాలి: పాక్ మాజీ కెప్టెన్

భారత్, పాకిస్థాన్ బోర్డులకు ఉన్న టోర్నీల హోస్టింగ్ హక్కుల్ని ఐసీసీ రద్దు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. భేదాలు సెట్ అయ్యేవరకూ హోస్టింగ్‌ను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ‘2023-2031 మధ్యకాలంలో పాక్‌లో రెండు ఈవెంట్లు, INDలో 5 ఈవెంట్లు ఉన్నాయి. ఆ నిర్వహణ హక్కులన్నింటినీ ఐసీసీ వేరే దేశాలకు తరలించాలి. అప్పుడే సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News April 18, 2026
మహిళా రిజర్వేషన్లు.. సామాన్యులకు టికెట్ సాధ్యమా?

పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినా దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఇప్పుడున్న రాజకీయ నేతల కుటుంబసభ్యులు, బంధువులేనని పలువురు పెదవి విరుస్తున్నారు. వారి భార్యకో, కూతురికో, కోడలికే టికెట్ వస్తుందని, సాధారణ మహిళలకు టికెట్ దక్కడం చాలా కష్టమంటున్నారు. మీ COMMENT?
News April 18, 2026
సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్‌ఫెక్ట్‌గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్‌తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?
News April 18, 2026
రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.


