News November 14, 2024

IND, PAK హక్కుల్ని ICC రద్దు చేయాలి: పాక్ మాజీ కెప్టెన్

image

భారత్, పాకిస్థాన్ బోర్డులకు ఉన్న టోర్నీల హోస్టింగ్ హక్కుల్ని ఐసీసీ రద్దు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. భేదాలు సెట్ అయ్యేవరకూ హోస్టింగ్‌ను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ‘2023-2031 మధ్యకాలంలో పాక్‌లో రెండు ఈవెంట్లు, INDలో 5 ఈవెంట్లు ఉన్నాయి. ఆ నిర్వహణ హక్కులన్నింటినీ ఐసీసీ వేరే దేశాలకు తరలించాలి. అప్పుడే సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.

Similar News

News December 11, 2024

కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ: హరీశ్

image

TG: కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర దీక్షకు దిగగా ఆయనను జైలులో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు అన్నారు. జైలులో దీక్ష కొనసాగిస్తే కాంగ్రెస్ దిగొచ్చి డిసెంబర్ 9న ప్రకటన చేసిందన్నారు. కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయకుండా పారిపోయారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఈ CM ఎక్కడున్నారని ప్రశ్నించారు.

News December 11, 2024

APకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

image

APకి రూ.4లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయని కలెక్టర్ల సదస్సులో CM చంద్రబాబు వెల్లడించారు. వీటితో 4లక్షల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.31వేల కోట్లు సమకూర్చామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామసభల ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతాయన్నారు.

News December 11, 2024

వచ్చే ఏడాదిపై సమంత ఆసక్తికర పోస్ట్

image

స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. వచ్చే ఏడాది తనకు ఎలా ఉంటుందో చెప్పే సందేశాన్ని పంచుకున్నారు. 2025లో చాలా బిజీగా ఉండటమే కాకుండా డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారని అందులో ఉంది. ప్రేమను పంచే భాగస్వామిని పొందడంతో పాటు కొందరు పిల్లలు కూడా కలుగుతారని, మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని ఈ లిస్టులో ఉంది. దీంతో సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.