News November 14, 2024
Badass ఎయిర్‌లైన్స్ గురించి తెలుసా?

కఠిన పరిస్థితుల్లో దేనికీ తలొగ్గని వారిని Badassగా సంబోధిస్తారు. ఇప్పుడో Airlinesకు అదే పేరు దక్కింది. క్షిపణులు దూసుకొస్తున్నా, పొగలు కమ్మేస్తున్నా లెబనాన్‌కు చెందిన Middle East Airlines తన సర్వీసులను ఆపకుండా Badass ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది. యుద్ధంలోనూ ప్రయాణికులను గమ్యానికి చేరుస్తోంది. పౌరుల కోసం ఎయిర్‌పోర్టును వాడితే దాడి చేయబోమని ఇజ్రాయెల్ హామీ ఇచ్చినట్టు ఓ కెప్టెన్ తెలిపారు.
Similar News
News July 7, 2025
మొబైల్ రీఛార్జ్‌లు పెంపు?

రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది భారీగా ధరలు పెంచగా, ఈ సారీ 10-12% పెంచే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూజర్లు పెరగడం, 5G ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని సమాచారం. అయితే బేస్ ప్లాన్ల జోలికి వెళ్లకుండా, మిడిల్, టాప్ ప్లాన్ల రేట్లు పెంచుతారని, కొన్ని ప్లాన్లలో కోత విధిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
News July 7, 2025
జులై 7ను జీవితంలో మరిచిపోలేను: రేవంత్ రెడ్డి

తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజా పాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జులై 7ను జీవితంలో మరచిపోలేను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.
News July 7, 2025
విద్యార్థులతో మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

AP: మంత్రి నారా లోకేశ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు అధికారుల చొరవతో తాజాగా స్కూళ్లో చేరగా వారికి భవిష్యత్తులో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. పేదరికం నుంచి బయటపడేలా చేసే శక్తిమంతమైన సాధనం విద్య అని లోకేశ్ చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తన తల్లే కారణమని, ఆమె వల్లే క్రమశిక్షణ అలవడిందని మంత్రి ఎమోషనల్ అయ్యారు.