News November 14, 2024

Badass ఎయిర్‌లైన్స్ గురించి తెలుసా?

image

కఠిన పరిస్థితుల్లో దేనికీ తలొగ్గని వారిని Badassగా సంబోధిస్తారు. ఇప్పుడో Airlinesకు అదే పేరు దక్కింది. క్షిప‌ణులు దూసుకొస్తున్నా, పొగ‌లు క‌మ్మేస్తున్నా లెబ‌నాన్‌కు చెందిన Middle East Airlines త‌న స‌ర్వీసుల‌ను ఆప‌కుండా Badass ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది. యుద్ధంలోనూ ప్ర‌యాణికుల‌ను గ‌మ్యానికి చేరుస్తోంది. పౌరుల కోసం ఎయిర్‌పోర్టును వాడితే దాడి చేయ‌బోమ‌ని ఇజ్రాయెల్ హామీ ఇచ్చిన‌ట్టు ఓ కెప్టెన్ తెలిపారు.

Similar News

News March 15, 2026

MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

image

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News March 15, 2026

ఎన్నికల వే‘ఢీ’.. సమ్మర్‌లో సమరమే!

image

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల <<19389988>>షెడ్యూల్‌తో<<>> వేసవిలో ఎలక్షన్ వే‘ఢీ’ మొదలైంది. అస్సాం మినహా మూడింట(TN, బెంగాల్, కేరళం) BJPయేతర ప్రభుత్వాలే ఉండటంతో సమరం రంజుగా సాగనుంది. ఆయా రాష్ట్రాల్లో పట్టు సాధించాలని BJP చూస్తుండగా మరోసారి ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలని స్టాలిన్, మమత, విజయన్ పోరాడుతున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పార్టీల ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ఈసమ్మర్ హాట్‌హాట్‌గా సాగనుంది.

News March 15, 2026

గిల్, మంధానకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

image

2024-2025 ఏడాదికి గానూ క్రికెటర్లు గిల్, మంధానను ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. అంతర్జాతీయ మెన్స్ క్రికెట్‌లో గొప్ప గౌరవంగా భావించే పాలీ ఉమ్రిగర్ అవార్డును గిల్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది బెస్ట్ ఇంటర్నేషనల్ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధానను BCCI ఎంపిక చేసింది. ఈమె ఈ అవార్డు అందుకోవడం ఐదోసారి కావడం విశేషం. ఢిల్లీలో జరిగిన నమన్ అవార్డ్స్-2026 వేడుకలో వీరిద్దరూ ఈ పురస్కారాలు అందుకున్నారు.