News November 14, 2024
రేపు స్కూళ్లకు సెలవు

రేపు గురునానక్ జయంతి – కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలీడే ఉంది. అన్ని రకాల విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో శుక్రవారం ఆప్షనల్ హాలీడే మాత్రమే ఇచ్చారు. దాని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Similar News
News July 10, 2025
సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నేడు క్లారిటీ!

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, బనకచర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువవికాసం పథకం అమలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 18 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరగ్గా 300కు పైగా అంశాలపై చర్చించారు.
News July 10, 2025
EP-3: ఇలా చేస్తే వివాహ బంధం బలపడుతుంది: చాణక్య నీతి

వివాహ బంధం బలపడాలంటే దంపతులు ఎలా నడుచుకోవాలో చాణుక్యుడు వివరించారు. ఇద్దరూ కోపం తగ్గించుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. అన్ని విషయాలను చర్చించుకోవాలి. కష్టసుఖాలను పంచుకోవాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. మంచైనా/చెడైనా హేళన చేసుకోకూడదు. నేనే గొప్ప అనే అహం భావాన్ని పక్కన పెట్టి అన్ని పనుల్లో పరస్పరం సహకరించుకోవాలి.
<<-se>>#chanakyaneeti<<>>
News July 10, 2025
బుమ్రా, ఆర్చర్.. అంచనాలు అందుకుంటారా?

ఇవాళ భారత్- ఇంగ్లండ్ లార్డ్స్‌లో మూడో టెస్టులో తలపడనున్నాయి. అక్కడ పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే ఛాన్స్ ఉంది. అందుకే బుమ్రా, ఆర్చర్‌పై ప్లేయర్లే కాదు.. అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతున్నారు. వీళ్లు రాణిస్తే బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అయితే, ఎంత మేరకు అంచనాలు అందుకుంటారో చూడాలి.