News November 14, 2024
రేపు స్కూళ్లకు సెలవు
రేపు గురునానక్ జయంతి – కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలీడే ఉంది. అన్ని రకాల విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో శుక్రవారం ఆప్షనల్ హాలీడే మాత్రమే ఇచ్చారు. దాని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Similar News
News December 4, 2024
PHOTO: ఒక్కటైన నాగచైతన్య-శోభిత
అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ వివాహం ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకల్లో వధూవరుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ జంట రేపు లేదా ఎల్లుండి శ్రీశైలం/తిరుమలకు వెళ్లనున్నారు.
News December 4, 2024
‘పుష్ప-2’: స్టార్లు ఏ థియేటర్లో చూస్తున్నారంటే?
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీపై అభిమానులతో పాటు సెలబ్రిటీల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇవాళ రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా పలువురు సెలబ్రిటీలు థియేటర్లలో వీక్షించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
* సంధ్య(RTC X ROAD)- కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్
* నల్లగండ్ల అపర్ణ- దర్శకుడు రాజమౌళి
* AMB- పుష్ప-2 నిర్మాతలు
* శ్రీరాములు(మూసాపేట)-దిల్ రాజు, అనిల్ రావిపూడి, ఇతర ప్రముఖులు
News December 4, 2024
GOOD NEWS: త్వరలో 1,00,204 ఉద్యోగాల భర్తీ
CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. CRPF-33,730, CISF-31,782, BSF-12,808, ITBP-9,861, SSB-8,646, అస్సాం రైఫిల్స్‌లో 3,377 చొప్పున పోస్టులున్నట్లు చెప్పారు. UPSC, SSC ద్వారా త్వరగా భర్తీ చేస్తామన్నారు. వైద్యపరీక్షల సమయం తగ్గించి, కానిస్టేబుల్ GD కోసం షార్ట్ లిస్టైన వారి కటాఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.