News November 15, 2024
కడప పెద్దదర్గా ఉత్సవాలకు సర్వం సిద్ధం

AP: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు గంధం, ఎల్లుండి ఉరుసు, 18న ముషాయిరా ఉంటాయని చెప్పారు. 20వ తేదీన రాత్రి ఊరేగింపు ఉంటుందన్నారు. ఇందుకోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Similar News
News April 19, 2026
అశ్వగంధ ఆకులతో హాని.. వాడొద్దు: FSSAI

ఔషధాలు, ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ వేర్లు లేదా దాని సారాన్ని మాత్రమే వాడాలని తయారీదారులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఆదేశించింది. ఆకులను పౌడర్ రూపంలో లేదా వేరే ఏ ఇతర రూపంలోనూ వాడకూడదంటూ నిషేధం విధించింది. ఈ ఆకుల వాడకం వల్ల కాలేయం, నరాలు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదముందని తెలిపింది. కంపెనీలు తాము మొక్కలోని ఏ భాగాన్నీ వాడుతున్నదీ తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది.
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.


