News November 15, 2024
కడప పెద్దదర్గా ఉత్సవాలకు సర్వం సిద్ధం
AP: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు గంధం, ఎల్లుండి ఉరుసు, 18న ముషాయిరా ఉంటాయని చెప్పారు. 20వ తేదీన రాత్రి ఊరేగింపు ఉంటుందన్నారు. ఇందుకోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Similar News
News December 11, 2024
BREAKING: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <
News December 11, 2024
తొక్కిసలాట ఘటన.. హైకోర్టుకు అల్లు అర్జున్
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ‘పుష్ప-2’ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా తొక్కిసలాటలో <<14793383>>మహిళ మరణించిన<<>> సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌తో పాటు సెక్యూరిటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News December 11, 2024
టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల
AP: పదో తరగతి పరీక్షల <
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.