News November 15, 2024
రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో పవన్ ప్రచారం
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో ఎన్డీఏ తరఫు అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాందేడ్, భోకర్, లాతూర్, సోలాపూర్, చంద్రపూర్, పుణే ప్రాంతాల్లో 5 సభలు, రెండు రోడ్ షోలలో పాల్గొంటారని జనసేన వెల్లడించింది. బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Similar News
News November 15, 2024
IPL: సెట్-1 ప్లేయర్లు వీరే
ఈ నెల 24న మధ్యాహ్నం ఒంటి గంటకు ఐపీఎల్-2025 మెగా వేలం ప్రారంభం కానుంది. తొలి సెట్‌లో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వేలానికి రానున్నారు. సెట్-2లో యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వస్తారు. సెట్-3లో బ్రూక్, కాన్వే, మెక్‌గుర్క్, త్రిపాఠి, వార్నర్, పడిక్కల్, మార్క్రమ్ వస్తారు.
News November 15, 2024
ప్రమాదంలో 80శాతానికి పైగా భారతీయుల ఆరోగ్యం: శాస్త్రవేత్త
పర్యావరణ మార్పు, కాలుష్యం కారణంగా భారత్‌లో 80శాతంమంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి సంబంధిత సమస్యల నుంచి మాతృత్వ సమస్యల వరకూ అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం ప్రభుత్వాల ప్రాధాన్యం కావాలి’ అని స్పష్టం చేశారు.
News November 15, 2024
తుఫాను వెళ్లే దారేది.. పసిగడుతున్న AI
వాతావరణ పరిస్థితులపై ఇటీవల సంప్రదాయ అంచనా విధానాలతో పోలిస్తే AI ఇస్తున్న కచ్చితమైన అంచనాలు నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. జులైలో బెరిల్ హరికేన్ దక్షిణ మెక్సికో నుంచి దక్షిణ టెక్సాస్ వైపు పయనిస్తుందని ఇతర విధానాల కంటే Google DeepMind’s GraphCast వారం ముందే పసిగట్టడం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. అయితే వీటికి ఫిజిక్స్ తెలియదని, సంప్రదాయ విధానాలతోపాటు వీటిని వాడుకోవచ్చంటున్నారు.