News November 15, 2024
రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో పవన్ ప్రచారం
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో ఎన్డీఏ తరఫు అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాందేడ్, భోకర్, లాతూర్, సోలాపూర్, చంద్రపూర్, పుణే ప్రాంతాల్లో 5 సభలు, రెండు రోడ్ షోలలో పాల్గొంటారని జనసేన వెల్లడించింది. బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Similar News
News December 11, 2024
నేడు జైపూర్‌కు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే బంధువుల వివాహానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హస్తినలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన కలుస్తారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. సీఎం తిరిగి గురువారం హైదరాబాద్ చేరుకుంటారు.
News December 11, 2024
అమెరికాకు తగ్గిన భారత విద్యార్థులు
ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది తగ్గింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,008 మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ అయ్యాయి. అదే గతేడాది, ఇదే కాలంలో లక్షకు పైగా వీసాలు మంజూరైనట్లు అమెరికన్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. కొవిడ్ తర్వాత భారత విద్యార్థులకు ఈ స్థాయిలో వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. అటు, చైనా నుంచి కూడా 8% తగ్గుదల కనిపించింది.
News December 11, 2024
యంగ్ డైరెక్టర్‌తో గోపిచంద్ మూవీ?
‘విశ్వం’ తర్వాత గోపీచంద్ నటించే మూవీపై అప్‌డేట్ రాలేదు. తాజాగా, ఆయన ‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల డైరెక్టర్ ఓ కథ చెప్పగా అది గోపిచంద్‌కు నచ్చి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కథ విభిన్నమైందని, చిట్టూరి శ్రీనివాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.