News November 15, 2024

OTD: సచిన్ అరంగేట్రానికి సరిగ్గా 35 ఏళ్లు

image

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 35 ఏళ్లు అవుతోంది. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో డకౌటైనా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 200కుపైగా టెస్టులు, 400కుపైగా వన్డేలు ఆడి శత శతకాలు బాదారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశారు. 2013లో ఇదే తేదీన చివరిసారిగా బ్యాటింగ్‌కు దిగారు.

Similar News

News November 15, 2024

IIT మద్రాస్‌తో ప్రభుత్వం ఒప్పందాలు

image

8 విభాగాలకు సంబంధించి సాంకేతికత, పరిశోధనల ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా IIT మద్రాస్‌తో AP ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అమరావతిలో డీప్ టెక్ పరిశోధన, స్కిల్ డెవలప్‌మెంట్‌లో నాణ్యత పెంచేలా సహకారం తీసుకోనుంది. విద్యాశాఖ, IT, పరిశ్రమలు, క్రీడలు, RTGS అంశాల్లోనూ ప్రభుత్వం ఆ సంస్థతో కలిసి పనిచేయనుంది.

News November 15, 2024

IPL: సెట్-1 ప్లేయర్లు వీరే

image

ఈ నెల 24న మధ్యాహ్నం ఒంటి గంటకు ఐపీఎల్-2025 మెగా వేలం ప్రారంభం కానుంది. తొలి సెట్‌లో జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వేలానికి రానున్నారు. సెట్-2లో యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వస్తారు. సెట్‌-3లో బ్రూక్, కాన్వే, మెక్‌గుర్క్, త్రిపాఠి, వార్నర్, పడిక్కల్, మార్క్రమ్ వస్తారు.

News November 15, 2024

ప్రమాదంలో 80శాతానికి పైగా భారతీయుల ఆరోగ్యం: శాస్త్రవేత్త

image

పర్యావరణ మార్పు, కాలుష్యం కారణంగా భారత్‌లో 80శాతంమంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి సంబంధిత సమస్యల నుంచి మాతృత్వ సమస్యల వరకూ అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం ప్రభుత్వాల ప్రాధాన్యం కావాలి’ అని స్పష్టం చేశారు.