News November 15, 2024
OTD: సచిన్ అరంగేట్రానికి సరిగ్గా 35 ఏళ్లు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 35 ఏళ్లు అవుతోంది. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో డకౌటైనా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 200కుపైగా టెస్టులు, 400కుపైగా వన్డేలు ఆడి శత శతకాలు బాదారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశారు. 2013లో ఇదే తేదీన చివరిసారిగా బ్యాటింగ్‌కు దిగారు.
Similar News
News December 12, 2024
కాబూల్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. శరణార్థుల మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతనితో సహా 12 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. అనుమానితుడి ఫొటోను తాలిబన్ మీడియా రిలీజ్ చేసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News December 12, 2024
పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన APPSC
AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షలను మార్చి 16వ తేదీ ఉదయం 9.30 నుంచి మ.12 వరకు నిర్వహించనుంది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను మార్చి 17వ తేదీన ఉదయం 9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. షెడ్యూల్ కోసం ఇక్కడ <
News December 12, 2024
జమిలి ఎన్నికలకు డ్రాఫ్ట్ బిల్లు రెడీ.. రేపు క్యాబినెట్ ముందుకు?
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు చట్ట సవరణలు చేయాల్సి ఉండడంతో ఆ మేరకు ముసాయిదా బిల్లును న్యాయ శాఖ రూపొందించినట్టు సమాచారం. ఈవారమే బిల్లు పార్లమెంటు ముందుకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.