News November 15, 2024

గాడిద పాల పేరుతో ఘరానా మోసం

image

గాడిద పాల పేరుతో డాంకీ ప్యాలెస్ సంస్థ తెలంగాణ, AP, తమిళనాడు, కర్ణాటకలోని రైతులను ₹100 కోట్ల వరకూ మోసం చేసింది. ఒక్కో గాడిదను రూ.లక్షన్నరకు అమ్మిన సంస్థ లీటర్ పాలను ₹1600కు కొంటామని నమ్మించింది. తొలి 3 నెలలు నమ్మకంగా సేకరణ డబ్బులు చెల్లించి, గత 18 నెలలుగా పెండింగ్‌లో ఉంచింది. చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో AP, TG CMలు న్యాయం చేయాలని బాధితులు HYD ప్రెస్‌ క్లబ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 15, 2024

ఝార్ఖండ్ ఎన్నిక‌ల వేళ బీజేపీ వ్యూహం

image

ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్‌కు గిరిజ‌నుల ఆరాధ్యుడు <<14618652>>బిర్సా‌ముండా పేరు<<>> పెట్టి BJP వ్యూహాత్మ‌క రాజ‌కీయానికి తెరలేపింది. ఝార్ఖండ్‌‌లో 38 సీట్లకు రెండో దశలో ఎన్నిక‌లు జరగనున్నాయి. ఝార్ఖండ్ ఏర్పడకముందు 1875-1990 మ‌ధ్య కాలంలో ఈ ప్రాంత గిరిజనులకు బిర్సాముండా ఓ ధైర్యం. ఆ స్థాయి ప్రాబ‌ల్యం క‌లిగిన బిర్సా పేరును ఎన్నిక‌ల వేళ తెర‌పైకి తెచ్చి BJP వ్యూహాత్మక రాజకీయం చేస్తోందని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

News November 15, 2024

నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే..

image

కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. రోజుకోసారైనా రుచి చూడాలని తహతహలాడుతుంటారు. కానీ నెలరోజులపాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలపాటు మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.

News November 15, 2024

US డోజ్ నుంచి జాబ్ నోటిఫికేషన్

image

యూఎస్ డోజ్ (DOGE) జాబ్ అప్లికేష‌న్ల‌ను ఆహ్వానించింది. అమెరికా ఫెడ‌ర‌ల్ ప‌రిపాల‌నా వ్యవహారాలను చక్క‌దిద్ద‌డం స‌హా అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించేలా నిత్యం వ్యూహాల‌ను ప్ర‌తిపాదించే స‌మ‌ర్థుల కోసం వెతుకుతోంది. సూప‌ర్ IQ ఉన్న వ్య‌క్తులు వారంలో 80 గంట‌ల‌కుపైగా ప‌నిచేయగలిగిన వారు త‌మ CVల‌ను పంపాల‌ని కోరింది. వీరిలో టాప్ 1% అభ్యర్థులను మ‌స్క్‌, వివేక్ రామ‌స్వామి రివ్యూ చేసి ఎంపిక చేస్తార‌ని డోజ్ తెలిపింది.