News November 15, 2024
గాడిద పాల పేరుతో ఘరానా మోసం
గాడిద పాల పేరుతో డాంకీ ప్యాలెస్ సంస్థ తెలంగాణ, AP, తమిళనాడు, కర్ణాటకలోని రైతులను ₹100 కోట్ల వరకూ మోసం చేసింది. ఒక్కో గాడిదను రూ.లక్షన్నరకు అమ్మిన సంస్థ లీటర్ పాలను ₹1600కు కొంటామని నమ్మించింది. తొలి 3 నెలలు నమ్మకంగా సేకరణ డబ్బులు చెల్లించి, గత 18 నెలలుగా పెండింగ్‌లో ఉంచింది. చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో AP, TG CMలు న్యాయం చేయాలని బాధితులు HYD ప్రెస్ క్లబ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 9, 2024
మేం ఏమన్నా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?: మమత
భారత్‌లోని పలు రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని కొందరు బంగ్లా రాజకీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు చేసిన వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ‘మీరు బెంగాల్, ఒడిశా, బిహార్‌లను ఆక్రమించుకుంటుంటే మేము మాత్రం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?’ అంటూ కౌంటర్ అటాక్ చేశారు. బంగ్లాలో హిందువులు హింసకు గురవుతుండడంపై బెంగాల్ హిందూ, ముస్లింలు ఆందోళనగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
News December 9, 2024
ధన్‌ఖఢ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం!
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖఢ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా ఆయన సభను నడుపుతున్న తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఛైర్మన్ తమతో వాగ్వాదానికి దిగుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన తీర్మానంపై TMC, AAP, SP సంతకాలు చేశాయి. త్వరలో సభలో ప్రవేశపెట్టనున్నాయి.
News December 9, 2024
తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
TG: రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్న లక్ష్మీనక్షత్ర(13)ను ఆమె తల్లి ఏదో విషయంలో మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన ఆమె రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీనక్షత్ర మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.