News November 15, 2024
మోక్షజ్ఞ సినిమాలో విక్రమ్ తనయుడు?

నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మూవీలో విలన్ రోల్‌కి తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్‌ను సంప్రదించారని భోగట్టా. అందుకాయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇక హీరోయిన్గా రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య క్లైమాక్స్‌లో ప్రత్యేక పాత్రలో తళుక్కుమంటారని మూవీ టీమ్ చెబుతోంది.
Similar News
News November 9, 2025
ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్లకు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
News November 9, 2025
చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.
News November 9, 2025
భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్లో భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.


