News November 15, 2024

మోక్షజ్ఞ సినిమాలో విక్రమ్ తనయుడు?

image

నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మూవీలో విలన్ రోల్‌కి తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్‌ను సంప్రదించారని భోగట్టా. అందుకాయన సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇక హీరోయిన్‌గా రవీనా టాండన్ కుమార్తె రాశా థడానీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య క్లైమాక్స్‌లో ప్రత్యేక పాత్రలో తళుక్కుమంటారని మూవీ టీమ్ చెబుతోంది.

Similar News

News December 6, 2024

మీ వద్ద రూ.2 వేల నోట్లు ఇంకా ఉన్నాయా!

image

₹2 వేలు విలువైన నోట్ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు RBI ప్ర‌క‌టించి ఏడాదిన్న‌ర కావ‌స్తున్నా ఇంకా 3.46 కోట్ల పెద్ద నోట్లు(₹6,920 Cr) చెలామ‌ణిలోనే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 2023లో ఉపసంహరణ ప్రకటన చేసే నాటికి 17,793 లక్షల నోట్లు చెలామణిలో ఉండ‌గా, 2024 Nov నాటికి 17,447 లక్షల నోట్లు వెన‌క్కి వ‌చ్చాయంది. RBIకి చెందిన 19 కేంద్రాల్లో వీటిని మార్చుకోవ‌చ్చ‌ని, పోస్టు ద్వారా పంప‌వ‌చ్చ‌ని తెలిపింది.

News December 6, 2024

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

image

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదంటూ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

News December 6, 2024

SHOCKING: నటి ప్రైవేట్ వీడియోలు లీక్

image

సౌత్ ఇండియా నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం కలకలం రేపింది. ఆమెకు సంబంధించిన వీడియోలను దుండగులు ఆన్‌లైన్‌లో పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో #pragyanagra హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందుకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. హరియాణాకు చెందిన ప్రగ్యా తమిళ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు.