News November 15, 2024
IPL ఆక్షనీర్‌గా మల్లికా సాగర్?
ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వాహకురాలిగా మరోసారి మల్లికా సాగర్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. 2023 వేలం కూడా ఆమెనే నిర్వహించారు. ఐపీఎల్ చరిత్రలోనే వేలం ప్రక్రియను పూర్తి చేసిన తొలి మహిళగా మల్లికకు రికార్డు ఉంది. గత వేలంలో ఆమె నిర్వహించిన ప్రత్యేక విధానానికి ప్రశంసలు రావడంతో మళ్లీ ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్. కాగా WPL వేలం నిర్వాహకురాలిగా కూడా ఆమె వ్యవహరించారు. ఈ నెల 24న జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.
Similar News
News November 16, 2024
IPL: ఆర్చర్, గ్రీన్‌కు బిగ్ షాక్?
విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చింది. జోఫ్రా ఆర్చర్, కామెరూన్ గ్రీన్, జాసన్ రాయ్ వంటి ఆటగాళ్లకు మెగా వేలం షార్ట్ లిస్టులో స్థానం కల్పించలేదు. టోర్నీ మధ్యలోనే వీరు అకారణంగా వెళ్లిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2024
ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
ఢిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీలోని జనక్‌పురీ, నంగ్లోయ్‌లో రూ.900 కోట్ల విలువైన 80 KGల కొకైన్‌ను నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ కన్‌సైన్‌మెంట్‌ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్రువీకరిస్తూ డ్రగ్స్ రాకెట్‌పై నిర్దాక్షిణ్యంగా వేట సాగిస్తామని పేర్కొన్నారు. అధికారులను అభినందించారు.
News November 16, 2024
రేపు, ఎల్లుండి మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు రాజురా, డిగ్రాస్, వార్ధాలో, ఎల్లుండి నాందేడ్, నాయగావ్, భోకర్, సోలాపూర్‌లో రోడ్ షోల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన విషయం తెలిసిందే.