News November 15, 2024

సమగ్ర కుటుంబ సర్వేలో కవిత(PHOTOS)

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు ఇవాళ హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ సిబ్బందికి తమ పూర్తి వివరాలు ఇచ్చారు. కొన్ని వివరాలను కవితనే స్వయంగా నమోదు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చిన కవిత చాలారోజుల తర్వాత బయటి ప్రపంచానికి కనిపించారు.

Similar News

News March 28, 2026

రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం.. చెక్ చేసుకోండి!

image

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలుచేస్తోంది. దీనిద్వారా అర్హులైన ప్రతి కుటుంబం ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. అయితే దీనికి అర్హులో కాదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలని కేంద్రం సూచించింది. <>WWW.PMJAY.gov.in<<>> లేదా యాప్‌ ద్వారా ప్రాథమిక వివరాలతో అర్హులో కాదో చెక్ చేసుకోవాలి. ఆధార్ KYCతో అప్లై చేసుకోండి.

News March 28, 2026

జియోలో 30 రోజుల కొత్త ప్లాన్స్ తెలుసా!

image

JIO నుంచి 30 రోజుల స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ మరో 2 అందుబాటులోకి వచ్చాయి. రూ.365, రూ.355 ప్యాక్స్‌తో రీఛార్జ్ చేస్తే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS, 25GB డేటా, 3 నెలల పాటు JIO హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. డేటా పూర్తయినా 64kbps స్పీడ్‌తో డేటాను వినియోగించుకోవచ్చు.

News March 28, 2026

BREAKING: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

image

AP: రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. దీని కోసం ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాగా ఐదున్నర గంటల పాటు చర్చ జరిగింది. ఈ నెల 30వ తేదీ తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.