News November 15, 2024
సమగ్ర కుటుంబ సర్వేలో కవిత(PHOTOS)
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు ఇవాళ హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ సిబ్బందికి తమ పూర్తి వివరాలు ఇచ్చారు. కొన్ని వివరాలను కవితనే స్వయంగా నమోదు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చిన కవిత చాలారోజుల తర్వాత బయటి ప్రపంచానికి కనిపించారు.
Similar News
News December 9, 2024
స్ట్రెస్ సర్వే.. ‘YES’ అన్నవారిని తొలగించారు!
ఎలాంటి ఉద్యోగమైనా ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. యూపీలోని ‘YES MADAM’ అనే కంపెనీ ఉద్యోగులు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అనే దానిపై సర్వే నిర్వహించింది. కంపెనీలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నామని బదులిచ్చారు. వారికి HR నుంచి టెర్మినేషన్ మెయిల్ రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ‘హెల్తీ ఎన్విరాన్మెంట్ అందించడానికి మీ అభిప్రాయాలు పరిశీలిస్తాం. అయితే ఒత్తిడి ఉందన్నవారిని తొలగిస్తున్నాం’ అని కంపెనీ తెలిపింది.
News December 9, 2024
ఒక్క రోజు స్కూల్ స్కీమ్ @ Rs.17000
ఫారిన్ టూరిస్టులను ఆకర్షించేందుకు జపాన్ కంపెనీ ఉండోకైయా కొత్తగా ఆలోచించింది. జపనీస్ స్కూల్ లైఫ్‌ను ఆస్వాదించేందుకు ఒక రోజు స్టూడెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రూ.17వేలు చెల్లిస్తే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేరొచ్చు. యూనిఫాంతో పాటు కటానా ఫైట్ నేర్చుకొనేందుకు కిమినోస్ డ్రెస్ ఇస్తారు. స్థానిక డాన్స్ నేర్పిస్తారు. యాక్టివిటీస్ చేయిస్తారు. క్లాసుల మధ్యలో భూకంపం వస్తే ఎలా బయటపడాలో బోధిస్తారు.
News December 9, 2024
ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.