News November 16, 2024

‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు

image

PM నరేంద్రమోదీ ‘బ్రాండ్‌ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్‌తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.

Similar News

News November 16, 2024

రామ్మూర్తి మరణం కలచివేసింది: పవన్

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.

News November 16, 2024

ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలివ్వలేదు: రేవంత్

image

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును షిండే, అజిత్ పవార్ కాలరాశారని మండిపడ్డారు. చంద్రాపూర్‌లో మహావికాస్ అఘాడీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.

News November 16, 2024

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?

image

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ఇటీవల హీరో విశ్వక్ ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ENE-2’ 2026లో రిలీజ్ అవుతుందని ఆయన చెప్పినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సినిమాలో అదే టీమ్ కొనసాగుతుందా లేదా కొత్త టీమ్‌ను తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.