News November 16, 2024
బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుందా?

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం పదాల్ని తొలగించాలని చూస్తున్న బంగ్లాదేశ్ తిరిగి ఈస్ట్ పాకిస్థాన్ భావజాలానికి చేరువవుతున్నట్టు కనిపిస్తోంది! 1971లో లిబరేషన్ తర్వాత సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా బంగ్లా రాజ్యాంగానికి లౌకికవాదం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం మూలస్తంభాలుగా ఉన్నాయి. ఇప్పుడీ మూలాల్ని చెరిపేస్తే బంగ్లా మరో పాకిస్థాన్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 4, 2025
మనవరాలు, తల్లి, తాత.. ముగ్గురూ మృతి

TG: నిన్న మీర్జాగూడ <<18183262>>బస్సు<<>> ప్రమాదంలో మరణించిన తల్లీకూతుళ్ల ఫొటో గుండెలను పిండేసిన విషయం తెలిసిందే. తాండూరుకు చెందిన ఖాలీద్.. తన 40 రోజుల మనవరాలికి నామకరణం చేసేందుకు రెండు రోజుల క్రితం HYD నుంచి తీసుకొచ్చారు. అత్తారింట్లో దిగబెట్టేందుకు బస్సులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. తల్లి సలేహ బిడ్డకు హాని జరగకుండా పొత్తిళ్లలో గట్టిగా హత్తుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఆ ప్రమాదంలో ఖాలీద్ కూడా చనిపోయారు.
News November 4, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 4, 2025
కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్‌వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.


