News November 16, 2024

బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుందా?

image

రాజ్యాంగం నుంచి సెక్యుల‌రిజం, సోష‌లిజం ప‌దాల్ని తొల‌గించాల‌ని చూస్తున్న బంగ్లాదేశ్ తిరిగి ఈస్ట్‌ పాకిస్థాన్ భావజాలానికి చేరువ‌వుతున్నట్టు కనిపిస్తోంది! 1971లో లిబరేష‌న్ త‌ర్వాత సాంస్కృతిక ఔన్న‌త్యాన్ని ప్ర‌తిబింబించేలా బంగ్లా రాజ్యాంగానికి లౌకిక‌వాదం, జాతీయ‌వాదం, ప్ర‌జాస్వామ్యం మూల‌స్తంభాలుగా ఉన్నాయి. ఇప్పుడీ మూలాల్ని చెరిపేస్తే బంగ్లా మరో పాకిస్థాన్‌ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News December 11, 2024

మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ టెన్షన్

image

హైదరాబాద్ శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులు బయటకు వెళ్లిపోవాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే విష్ణు జోక్యం చేసుకుని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరని బదులిచ్చారు. మనోజ్‌కు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కూడా బయటకు వెళ్లాలని విష్ణు వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

News December 11, 2024

బుమ్రాకు పెద్ద గాయం..?

image

BGTని దక్కించుకోవాలంటే టీమ్ ఇండియాకు బుమ్రా కీలకం. అందుకే రెండో టెస్టులో ఆయన గాయపడటం అభిమానుల్ని కలవరపెట్టింది. అది చిన్నగాయమేనని టీమ్ మేనేజ్‌మెంట్ కొట్టిపారేసినప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేమియన్ ఫ్లెమింగ్ మాత్రం కాకపోవచ్చంటున్నారు. ‘అది తీవ్రగాయంలాగే కనిపిస్తోంది. బుమ్రా చివరి ఓవర్ కష్టంగా పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రేక్‌లో ఇబ్బంది పడ్డారు. వేగం కూడా చాలా తగ్గింది’ అని తెలిపారు.

News December 11, 2024

కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ: హరీశ్

image

TG: కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర దీక్షకు దిగగా ఆయనను జైలులో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు అన్నారు. జైలులో దీక్ష కొనసాగిస్తే కాంగ్రెస్ దిగొచ్చి డిసెంబర్ 9న ప్రకటన చేసిందన్నారు. కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయకుండా పారిపోయారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఈ CM ఎక్కడున్నారని ప్రశ్నించారు.