News November 16, 2024
ఏఆర్ రెహమాన్‌కు ఐఐటీ మద్రాస్ అవార్డు
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఎక్స్‌పీరియెన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(XTIC) పురస్కారాన్ని మద్రాస్ ఐఐటీ ప్రకటించింది. వర్చువల్ రియాలిటీ సినిమా ‘లే మస్క్’కు పనిచేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. రేపు జరిగే ‘XR’ సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందిస్తామని వెల్లడించింది.
Similar News
News November 16, 2024
‘కంగువా’ కలెక్షన్లు ఎంతంటే?
సూర్య, శివ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడికల్ ఫాంటసీ ఫిల్మ్ ‘కంగువా’. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.89.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొంది.
News November 16, 2024
BREAKING: నటి కస్తూరి అరెస్ట్
తెలుగు వారిపై వివాదాస్పద <<14525601>>వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరి అరెస్టయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా, హైదరాబాద్‌లో ఆచూకీ లభ్యమైంది. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.
News November 16, 2024
ఈ పెట్స్ చాలా కాస్ట్లీ గురూ!
జంతువులు, పక్షుల పెంపకం కొంతమందికి హాబీ. మరి కొంతమందికి అవసరం. కానీ కొందరికి మాత్రం అవి స్టేటస్ సింబల్. అందుకే కొన్ని పక్షులు, జంతువులు సామాన్యుడు కనీసం ఊహించలేని ధర పలుకుతుంటుంటాయి. వాటిలో కొన్ని చూస్తే..
టిబెటన్ మాస్టిఫ్: రూ.20 లక్షలు
సవానా పిల్లి: రూ.42 లక్షలు
హయాసింత్ మకావ్: రూ.40 లక్షలు
పామ్ కోకటూ: రూ. 17 లక్షల వరకు
కోయ్ చేపలు: రూ.1.5 లక్షలు