News November 16, 2024

ఏఆర్ రెహమాన్‌కు ఐఐటీ మద్రాస్ అవార్డు

image

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఎక్స్‌పీరియెన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(XTIC) పురస్కారాన్ని మద్రాస్ ఐఐటీ ప్రకటించింది. వర్చువల్ రియాలిటీ సినిమా ‘లే మస్క్’కు పనిచేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. రేపు జరిగే ‘XR’ సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందిస్తామని వెల్లడించింది.

Similar News

News December 11, 2024

GOOGLE: ప్రపంచంలో రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా GOOGLE అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.

News December 11, 2024

చట్టం వారికే చుట్టమా! భార్యా బాధితులకు లేదా రక్షణ?

image

క్రూరత్వం, గృహహింస నుంచి రక్షణగా స్త్రీల కోసం తెచ్చిన చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భార్య పెట్టిన తప్పుడు కేసులతో పడలేక, చట్టంతో పోరాడలేక నిన్న బెంగళూరు <<14841616>>టెకీ<<>> ప్రాణాలు విడిచిన తీరు కలతపెడుతోంది. చట్టాల్లోని కొన్ని లొసుగులను కొందరు స్త్రీలు ఆస్తి, విడాకుల కోసం వాడుకుంటున్న తీరు విస్మయపరుస్తోంది. ఇలాంటి ట్రెండు ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టూ చెప్పడం గమనార్హం.

News December 11, 2024

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN

image

AP: దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. సంక్రాంతి నాటికి ఆర్అండ్‌బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు’ అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.