News November 16, 2024
స్టార్ ప్లేయర్లకు గాయాలు.. BGTలో కుర్రాళ్లకు ఛాన్స్?
భారత స్టార్ ప్లేయర్లు గాయాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇండియా-ఏ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఉండమని BCCI కోరే అవకాశం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. రేపు రాత్రి ఇండియా-A జట్టు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరనుంది. BGTకి ముందు రాహుల్, గిల్‌కు గాయాలవ్వడం, రోహిత్ గైర్హాజరు వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
Similar News
News November 17, 2024
సొంత తప్పిదాల వల్ల కూడా ఉద్యోగ మోసాలు: సర్వే
ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల్లో 75% ఆశావహుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఫేక్ రిక్రూటర్‌లను గుర్తించడంలో విఫలమై మోసగాళ్లకు నగదు చెల్లిస్తున్నారని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జరిపిన సర్వేలో అత్యధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.
News November 17, 2024
కులం పేరుతో విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది: పవన్
దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా పీఎం మోదీకి మాత్రమే ఉందని AP Dy.CM పవన్ అన్నారు. మహారాష్ట్రలోని భోకర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘హిందు, ముస్లిం, క్రిస్టియన్ అనే భేద భావం మన దేశంలో లేదు. అమీర్, సల్మాన్, షారుఖ్ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా ఉన్నారు. అబ్దుల్ కలామ్‌ను గుండెల్లో పెట్టుకున్న దేశం మనది. ప్రజలను కులం, రిజర్వేషన్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది’ అని ఆరోపించారు.
News November 17, 2024
BGT: తొలి టెస్టుకు తుది జట్టు ఇదేనా?
BGTలో తొలి టెస్టు ఆరంభానికి మరో 5 రోజులు ఉంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగడం లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకుంటారని టాక్. జైస్వాల్‌తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ప్రాబబుల్ జట్టు: జైస్వాల్, సుదర్శన్, కోహ్లీ, రాహుల్, పంత్, జురెల్/నితీశ్, అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్