News November 17, 2024

తండ్రి మృతి.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

image

తన తండ్రి రామ్మూర్తినాయుడు మృతిచెందడంపై సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్న మీరొక ఫైటర్. మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం నేర్పారు. మీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. బై నాన్న’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 17, 2024

క్రిమినల్‌పై ‘పావలా’ రివార్డు

image

నేరస్థులు, మావోలు, సంఘవిద్రోహ శక్తులను పట్టుకునేందుకు వారిస్థాయిని బట్టి పోలీసులు రివార్డులు ప్రకటించడం సహజం. అయితే రాజస్థాన్‌లోని లఖన్‌పుర్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఖుబీరామ్ జాట్(48) అనే క్రిమినల్‌పై కేవలం పావలా రివార్డు ప్రకటించారు. నేరస్థుల స్థాయిని తక్కువ చేసి చూపడం, వారు కోరుకునే గుర్తింపును దక్కకుండా చేయడం కోసమే పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

News November 17, 2024

2,050 ప్రభుత్వ ఉద్యోగాలు.. 23న పరీక్ష

image

TG: రాష్ట్రంలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 23న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. హాల్‌టికెట్లను <>https://mhsrb.telangana.gov.in<<>> నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మొదటి సెషన్‌ ఉ.9-10.20 వరకు, రెండో సెషన్‌ మ.12.40-2 వరకు ఉంటుందని తెలిపింది. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది.

News November 17, 2024

మిస్ యూనివర్స్-2024 రేస్ నుంచి భారత్ ఔట్

image

మెక్సికోలో జరుగుతున్న మిస్ యూనివర్స్-2024 అందాల పోటీలో భారత్ ప్రస్థానం ముగిసింది. మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా స్విమ్ సూట్ రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 30 మంది పాల్గొన్న ఈ రౌండ్‌ నుంచి 12 మంది మాత్రమే తదుపరి గౌను రౌండ్‌కు ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌కు చెందిన రియా మిస్ యూనివర్స్ ఇండియా-2024 విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికయ్యారు.