News November 17, 2024

తండ్రి మృతి.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

image

తన తండ్రి రామ్మూర్తినాయుడు మృతిచెందడంపై సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్న మీరొక ఫైటర్. మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం నేర్పారు. మీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. బై నాన్న’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 11, 2024

మస్క్‌తో పెట్టుకుంటే మటాషే.. బిల్‌గేట్స్‌కు ₹12500 కోట్ల నష్టం!

image

మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్‌‌కు ఎలాన్ మస్క్ గట్టి పంచ్ ఇచ్చారు. ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా టెస్లా ఎదిగితే, షార్ట్ పొజిషన్ తీసుకుంటే బిల్‌గేట్స్ సైతం దివాలా తీయాల్సిందే’ అని అన్నారు. కొవిడ్ టైమ్‌లో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు టెస్లా షేర్లను గేట్స్ షార్ట్ చేశారు. ఈ పొజిషన్ ఆయనకు రూ.12500 కోట్ల నష్టం తెచ్చిపెట్టినట్టు సమాచారం. మళ్లీ ఈ విషయం వైరలవ్వడంతో మస్క్ పైవిధంగా స్పందించారు.

News December 11, 2024

30 మందిని కాపాడి ఏపీ జవాన్ వీరమరణం

image

AP: రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడుకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) 30 మంది సైనికులను కాపాడి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్‌ఓసీ వెంట 30 మంది జవాన్లతో కలిసి సుబ్బయ్య పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. ఇది గమనించి తన తోటి సైనికులను గో బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

News December 11, 2024

మోహన్‌ బాబుకు ఇంటర్నల్ గాయాలయ్యాయి: వైద్యులు

image

మోహన్ బాబు నిన్న రాత్రి అస్వస్థతతో తమ ఆసుపత్రిలో చేరారని కాంటినెంటల్ వైద్యులు తెలిపారు. ‘ఆయన వచ్చిన సమయంలో హైబీపీ ఉంది. వివిధ పరీక్షలు చేశాం. ఎడమవైపు కంటి కింద వాపు ఉంది. ఇంటర్నల్ గాయాలయ్యాయి. సిటీ స్కాన్ తీయాల్సి ఉంది. చికిత్సకు అవసరమైన ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం. ఆయన మరో రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉంది’ అని డాక్టర్లు వెల్లడించారు.