News November 17, 2024

ఆవు పేడలో నోట్ల కట్టలు

image

HYDలోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా సంస్థ లాకర్ నుంచి రూ.20లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఆ డబ్బును ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బాదమందరుని గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అతని అత్తమామలపై ఇంట్లో తనిఖీలు చేశారు. చివరికి ఆవు పేడ కుప్పలో నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Similar News

News April 18, 2026

గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

image

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ తగ్గిందని కేంద్రం తెలిపింది. రోజువారీ బుకింగ్స్ 46-50 లక్షల మధ్య ఉన్నాయని చెప్పింది. సిలిండర్ల సరఫరా కూడా స్థిరంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ సప్లై సాధారణంగానే జరుగుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇరాన్, US శాంతి ఒప్పందానికి దగ్గరవడం, హార్ముజ్ జలసంధిని తెరవడంతో దేశంలో LPG కష్టాలు తప్పనున్నాయి.

News April 18, 2026

TCS ఘటన ‘కార్పొరేట్ జిహాద్’: మహారాష్ట్ర సీఎం

image

TCS నాసిక్‌ క్యాంపస్‌‌లో <<19663286>>మత మార్పిడి<<>> వ్యవహారం జిహాద్‌ లాంటిదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ‘ఈ జిహాద్‌ను మేం వివిధ రూపాల్లో చూశాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వచ్చాయి. వాటి కంటే ఈ కార్పొరేట్ జిహాద్ ఇంకా తీవ్రమైనది. ఇది ఓ కంపెనీ ఆఫీసులోనే జరిగిందా? లేక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News April 18, 2026

‘5 రాష్ట్రాలు దాటి వచ్చారా?’.. అల్లు అర్జున్ పిటిషన్‌పై ఢిల్లీ HC

image

తన పర్సనాలిటీ రైట్స్ పరిరక్షించాలని అల్లు అర్జున్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ HC ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీ, TGకి మధ్య 5 రాష్ట్రాలున్నాయి. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు’ అని జస్టిస్ తుషార్ రావు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాది స్పందిస్తూ.. హక్కుల ఉల్లంఘన దేశమంతటా జరుగుతోందని, అందుకే రావాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో బన్నీ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని జడ్జి ఆదేశాలిచ్చారు.