News November 17, 2024
ఆవు పేడలో నోట్ల కట్టలు
HYDలోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా సంస్థ లాకర్ నుంచి రూ.20లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఆ డబ్బును ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బాదమందరుని గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అతని అత్తమామలపై ఇంట్లో తనిఖీలు చేశారు. చివరికి ఆవు పేడ కుప్పలో నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Similar News
News December 3, 2024
గుండు చేయిస్తే జుట్టు మందం అవుతుందా?
తలపై జుట్టు పలుచగా ఉంటే గుండు చేయించుకోవడం వల్ల మందంగా మొలుస్తుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. తలపై హెయిర్ సెల్స్ పుట్టుకతోనే ఉంటాయని, గుండు చేయించినంత మాత్రాన వాటి సంఖ్య పెరగదని చెబుతున్నారు. గుండు చేయించడం వల్ల వెంట్రుకలు మాత్రం మందంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకానీ తలపై వెంట్రుకలు ఎక్కువవడం సాధ్యం కాదంటున్నారు.
News December 3, 2024
విపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండే?
శివసేన పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రకటించేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తి చూపకపోవడంతో ఆయనను ప్రతిపక్షనేతగా నియమించనున్నట్లు సమాచారం. మహాయుతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలను కొంతమేర తగ్గించేందుకే కమలనాథులు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మహారాష్ట్ర సీఎంను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
News December 3, 2024
వన్యప్రాణుల బోర్డు ఛైర్మన్‌గా సీఎం రేవంత్
TG: రాష్ట్రంలో వన్యప్రాణుల బోర్డుకు ప్రభుత్వం కొత్త సభ్యులను నియమించింది. ఈ బోర్డుకు సీఎం రేవంత్ ఛైర్మన్‌గా, అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. అలాగే ఈ బోర్డులో మొత్తం 29 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలను బోర్డు నియమించింది. ఈ బోర్డులో ఎమ్మెల్యేలు భూక్యా మురళీ నాయక్, వంశీ కృష్ణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు ఉన్నారు.