News November 17, 2024
పుష్ప-2 సరికొత్త రికార్డు
సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్-రష్మిక నటించిన పుష్ప-2 సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదల కాకముందే ప్రీమియర్స్(DEC 4) కోసం అత్యంత వేగంగా 30+వేల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికే 8.52 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ సా.6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
Similar News
News November 17, 2024
ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిశోధన!
97 ఏళ్లుగా కొనసాగుతూ ప్రపంచంలోనే సుదీర్ఘమైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన పరిశోధన ఇది. ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త థామస్ పార్నెల్ 1927లో ‘పిచ్ డ్రాప్’ అనే పరిశోధన ప్రారంభించారు. తారు నుంచి లభ్యమయ్యే ‘పిచ్’ ద్రవం అత్యంత చిక్కగా ఉంటుంది. దాని చిక్కదనాన్ని కొలిచేందుకు వేడి చేసి గరాటులో పోస్తే 97 ఏళ్లలో 9 చుక్కలే బయటికొచ్చాయి. గరాటు నుంచి మొత్తం పిచ్ ఖాళీ అయ్యేందుకు మరో వందేళ్లు పడుతుందని అంచనా.
News November 17, 2024
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోంది: ఖర్గే
మణిపుర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ BJPని కాంగ్రెస్ నిలదీసింది. బీజేపీ పాలనలో ‘మణిపుర్ ఐక్యంగా లేదు, సురక్షితంగా లేదు’ అని ఖర్గే విమర్శించారు. 2023 నుంచి జరుగుతున్న హింస ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. ద్వేషపూరిత రాజకీయాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మణిపుర్ తగలబడాలని BJP చూస్తోందని ఖర్గే ఆరోపించారు.
News November 17, 2024
ఎక్కువ సేపు కూర్చుంటే త్వరగా ముసలితనం
ఎక్కువ సేపు కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిందే. వీరిలో అకాల వృద్ధాప్యం, గుండె జబ్బులు, మానసిక సమస్యలు వస్తాయని US సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. దాదాపు 1,000 మందిపై వీరు పరిశోధన చేశారు. పని తర్వాత నామమాత్రపు వాకింగ్ చేస్తే సరిపోదని, తీవ్రత ఉండాలని అంటున్నారు. రోజూ 30min రన్నింగ్/సైక్లింగ్ చేసే వారి వయసు 5-10ఏళ్లు తక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.