News November 17, 2024

పుష్ప-2 సరికొత్త రికార్డు

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్-రష్మిక నటించిన పుష్ప-2 సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదల కాకముందే ప్రీమియర్స్(DEC 4) కోసం అత్యంత వేగంగా 30+వేల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికే 8.52 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ సా.6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

Similar News

News December 12, 2024

జమిలి ఎన్నికలకు డ్రాఫ్ట్ బిల్లు రెడీ.. రేపు క్యాబినెట్ ముందుకు?

image

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పలు చట్ట సవరణలు చేయాల్సి ఉండడంతో ఆ మేరకు ముసాయిదా బిల్లును న్యాయ శాఖ రూపొందించినట్టు సమాచారం. ఈవారమే బిల్లు పార్లమెంటు ముందుకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

News December 12, 2024

EPFO ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్

image

EPFO ఖాతాదారులు తమ PF సొమ్మును ATM నుంచి విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2025 జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల సమాచారం. తమ సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా చెప్పారు. 2-3 నెలల్లో భారీ మార్పులు చూస్తారని తెలిపారు. ఈ నిర్ణయంతో కార్మికుల క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం అవుతాయని కేంద్రం భావిస్తోంది.

News December 12, 2024

డిసెంబ‌ర్ 14న మ‌హారాష్ట్ర క్యాబినెట్ విస్త‌ర‌ణ‌!

image

త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం మ‌హాయుతిలో CM అభ్య‌ర్థిత్వం కొలిక్కి వ‌చ్చింది. అయితే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పీఠ‌ముడి వీడ‌డం లేదు. కీల‌క శాఖ‌ల కోసం మిత్ర‌ప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. మ‌ధ్యేమార్గంగా మీక‌ది-మాకిది అన్నట్టుగా శాఖ‌లు పంచుకోవాల‌ని నిర్ణ‌యించాయి. 42 మందిని మంత్రులుగా నియ‌మించే అవకాశం ఉండడంతో మొత్తంగా BJPకి 21-22, శివ‌సేనకి 12-13, NCPకి 7-8 ద‌క్క‌వ‌చ్చు. Dec 14న విస్త‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం.