News November 18, 2024

Stock Market: నష్టాల వైపు పయనం

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమ‌వారం నష్టాల వైపు పయనిస్తున్నాయి. గ‌త సెష‌న్‌లో అమెరిక‌న్ సూచీలు భారీగా న‌ష్ట‌పోవ‌డంతో భార‌త మార్కెట్ల‌పై ప్ర‌భావం క‌నిపిస్తోంది. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 77,464 వ‌ద్ద‌, నిఫ్టీ (-30తో) 23,502 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెట‌ల్‌, ఫార్మా రంగాలు ప్రీ మార్కెట్‌ను లాభాల‌తో ఆరంభించాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, Oil & Gas న‌ష్టాల్లో ఉన్నాయి.

Similar News

News November 18, 2024

నేడు కడప దర్గాకు రామ్ చరణ్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు కడపలోని అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరుకానున్నారు. దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట మేరకు ఆయన మాలలో ఉన్నప్పటికీ దర్గాకు వెళ్తున్నారు. చరణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రార్థనల అనంతరం చరణ్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

News November 18, 2024

నేను భారతీయులకు గులాంను: కిషన్ రెడ్డి

image

TG: తనను గుజరాత్ గులాం అని విమర్శిస్తున్నారని, తాను భారతీయులకు గులాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటలీకి, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్‌ను కాదని దుయ్యబట్టారు. అదానీ పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అదానీతో రేవంత్ చర్చలు జరపడం లేదా అని ప్రశ్నించారు.

News November 18, 2024

అంగన్‌వాడీలకు గ్రాట్యుటీపై పరిశీలన: మంత్రి సంధ్యారాణి

image

AP: అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు. వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. వారి సమ్మె వల్ల గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళనలను విరమించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.