News November 18, 2024
Stock Market: నష్టాల వైపు పయనం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల వైపు పయనిస్తున్నాయి. గత సెషన్‌లో అమెరికన్ సూచీలు భారీగా నష్టపోవడంతో భారత మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 77,464 వద్ద, నిఫ్టీ (-30తో) 23,502 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, ఫార్మా రంగాలు ప్రీ మార్కెట్‌ను లాభాలతో ఆరంభించాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, Oil & Gas నష్టాల్లో ఉన్నాయి.
Similar News
News July 9, 2025
షాకింగ్.. పిల్లలకు లెక్కలు రావట్లేదు!

దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు(గణితం) రావట్లేదని కేంద్రం సర్వేలో తేలింది. మూడో తరగతి పిల్లల్లో 45% మంది ఆరోహణ, అవరోహణ క్రమాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొంది. ఆరో తరగతిలో 10 వరకు ఎక్కాలు(టేబుల్స్) వచ్చిన వారు 53% శాతమే. తొమ్మిదిలో గణితంపై అవగాహన ఉన్నవారు ఇంతే శాతమని తెలిపింది. దీని ప్రకారం విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
News July 9, 2025
పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్: రోజా

AP Dy.CM పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో EVM ప్రభుత్వం నడుస్తోందని ఆమె మండిపడ్డారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఒక EVM CM. APలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా EVMను ఆరు నెలలు భద్రపరుస్తారు. కానీ APలో మాత్రం 10 రోజులకే నాశనం చేయాలంటూ జీవో జారీ చేస్తారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
News July 9, 2025
ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటారు. అయితే, అందరిలా కాకుండా ఇతడు మాత్రం తన ప్రేయసి కోసం కావడి మోశారు. తాను ఇంటర్ పాసయ్యానని, ప్రేయసి IPS అయ్యేవరకూ ఇలా నీరు తెచ్చి దేవుడికి సమర్పిస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.